
జపాన్ ఓపెన్‌కు సైనా డుమ్మా
న్యూఢిల్లీ: యూరోపియన్ సర్క్యూట్‌లో బరిలోకి దిగే ముందు విశ్రాంతి కావాలని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జపాన్ ఓపెన్‌కు డుమ్మా కొట్టనుంది. సెప్టెంబరు 17 నుంచి 22 వరకు టోక్యోలో జరిగే ఈ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, కశ్యప్ బరిలో దిగుతున్నారు.
మొత్తం మీద ఈ టోర్నీకి భారత్ నుంచి 8 మంది షట్లర్లు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయిప్రణీత్, శ్రీకాంత్ కూడా ఇందులో ఉన్నారు. ‘ఐబీఎల్‌లో ఆడటం వల్ల అలసిపోయాను. కాబట్టి జపాన్ ఓపెన్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను’ అని సైనా చెప్పింది. సైనా డెన్మార్క్ ఓపెన్ ద్వారా తిరిగి పోటీలు మొదలుపెట్టనుంది. ఆ టోర్నీలో ఈ భారత స్టార్ డిఫెండింగ్ చాంపియన్. కోచ్ గోపీచంద్ సలహా మేరకు సైనాకు విశ్రాంతి ఇచ్చేందుకు ‘బాయ్’ అంగీకరించింది.