క్వార్టర్స్‌లో సాకేత్ | saket entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్

Published Wed, May 21 2014 11:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

saket entered in quarter finals

సాక్షి, హైదరాబాద్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్థాన్‌లోని కర్షి పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 7-6 (7/4), 6-2తో యాంటెల్ వాండెర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
 
 ఇక డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లుస్కీ (ఐర్లాండ్) జోడి 7-6 (7/5), 6-3తో చేజ్ బుచానన్ (అమెరికా)-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటపై గెలిచింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నికొలజ్ బాసిలాష్‌విలి (జార్జియా)తో సాకేత్; డబుల్స్ సెమీఫైనల్లో సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ (బెలారస్) జోడితో సాకేత్-క్లుస్కీ ద్వయం పోటీపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement