తైక్వాండో చాంప్ వరంగల్
రాష్ట్ర ఆర్‌జీకేఏ క్రీడలు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ (ఆర్‌జీకేఏ) క్రీడల్లో తైక్వాండో బాలుర ఓవరాల్ టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. బాలికల ఓవరాల్ టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జట్లు సంయుక్తంగా గెల్చుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన తైక్వాండో బాలుర విభాగంలో 29 పాయింట్లతో వరంగల్ అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 17 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా...నల్లగొండ జట్టు 13 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే బాలికల విభాగంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లా జట్లు సంయుక్తంగా విజేతగా నిలువగా, వరంగల్ జట్టు మూడో స్థానం పొందింది.
400 మీటర్ల విజేతలు రామ్‌రెడ్డి, కావ్య
అథ్లెటిక్స్ మీట్‌లో బాలుర విభాగం 400 మీటర్ల లో నల్లగొండ అథ్లెట్ రామ్‌రెడ్డి 53.86 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం గెలిచాడు. వి.నాగరాజ్ (ఖ మ్మం) ద్వితీయ స్థానంలో నిలిచి రజతం గెల్చుకోగా, జి.మధు (ఖమ్మం) తృతీయ స్థానంలో ని లిచి కాంస్యం గెలిచాడు. బాలికల విభాగం 400 మీటర్లులో కావ్య (నల్లగొండ), ఎన్.జ్యోతి (నల్లగొండ), ఎం.తేజస్వి (రంగారెడ్డి జిల్లా)లు వరుసగా స్వర్ణం, రజత, కాంస్య పతకాలు గెలిచారు.
రంగారెడ్డి జిల్లా జట్ల ముందంజ
వాలీబాల్ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో రంగారెడ్డి జిల్లా జట్లు లీగ్ మ్యాచ్ విజయాలను నమోదు చేసుకున్నాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన బాలికల లీగ్ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 25-20, 25-20 స్కోరుతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా 25-22, 25-23తో కరీంనగర్ జట్టుపై గెలిచింది. బాలుర లీగ్ పోటీల్లో ఖమ్మం 25-9, 25-22తో వరంగల్‌పై, మెదక్ 25-21, 25-15తో వరంగల్‌పై, నిజామాబాద్ 23-25, 25-22, 15-8తో కరీంనగర్‌పై గెలిచాయి. బాలికల లీగ్ పోటీల్లో నల్లగొండ 25-23, 25-12తో మెదక్‌పై, నిజామాబాద్ 25-21, 25-19తో కరీంనగర్‌పై, మెదక్ 22-25, 25-14, 15-9తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి.
అథ్లెటిక్స్ ఫైనల్స్ ఫలితాలు: బాలుర విభాగం: 100మీ: 1.కె.నాగరాజ్ (ఖమ్మం), 2.పి.భువేష్ (రంగారెడ్డి జిల్లా), 3.బి.వినీత్ (రంగారెడ్డి జిల్లా), 1500మీ: 1.ఎ.మల్లేశం (నల్లగొండ), 2.పి.మహిపాల్ (రంగారెడ్డి జిల్లా), 3.బి.వెంకటప్ప (రంగారెడ్డి జిల్లా). హైజంప్: 1. ఆర్.ముని (నల్లగొండ), 2.కె.ఇంద్రసేన్( వరంగల్), 3. జి.కన్నారావు ( ఖమ్మం). డిస్కస్‌త్రో: 1. ఎం.రవి (కరీంనగర్). 2.జి.బాలరాజ్(మెదక్), 3.వి.శివరామ్ (రంగారెడ్డి జిల్లా). బాలికల విభాగం: 100మీ: 1.బాను చంద్రిక (ఖమ్మం), 2.కె.చైతన్య (నల్లగొండ), 3.పి.దివ్య పావని (ఖమ్మం). 1500మీ: 1.ఆర్.శిల్ప (నల్లగొండ), 2.ఎం.కావ్య (ఆదిలాబాద్), 3.జి.మహేశ్వరీ (నల్లగొండ). హైజంప్: 1. లక్ష్మీ(ఆదిలాబాద్), 2. పి.స్వాతి (కరీంనగర్), 3.వి.జ్యోత్స్న (మెదక్). షాట్‌ఫుట్: 1.హెచ్.ఫాతిమా(ఖమ్మం), 2.జె. సంధ్య (వరంగల్), 3.ఎ.శ్రావణి(ఆదిలాబాద్).