నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ చూడాలని ప్రతీ సాకర్ అభిమాని కోరుకుంటాడు. కానీ అందరికీ సాధ్యం కాదు..
కోల్‌కతా: నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ చూడాలని ప్రతీ సాకర్ అభిమాని కోరుకుంటాడు. కానీ అందరికీ సాధ్యం కాదు.. అయితే కోల్‌కతాకు చెందిన 81 ఏళ్ల పన్నాలాల్ చటర్జీ, ఆయన భార్య చైతాలి మాత్రం రెండు దశాబ్దాలుగా సాకర్ ప్రపంచకప్ ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడికి వెళుతున్నారు. ఈ నెల 17న తాత, బామ్మలు బ్రెజిల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. 1982 నుంచి ఒక్క ప్రపంచకప్ కూడా వదలకుండా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 8 ప్రపంచకప్‌లకు హాజరయ్యారు.
తొమ్మిదోసారి సాకర్ మజాను ఆస్వాదించబోతున్నారు. ఈ వృద్ధ దంపతులది మధ్యతరగతి కుటుం బమే. రూ. 7500 పెన్షన్ వచ్చే పన్నాలాల్ అందులో కొంత మొత్తాన్ని ప్రతీ నెల ప్రపంచకప్ కోసం కేటాయిస్తారు. ఇక చైతాలి బామ్మ తాను చేసే చీరల వ్యాపారం ద్వారా కొంత సంపాదించి ప్రపంచకప్ కోసం ఉపయోగిస్తారు.