రోహిత్‌ సెంచరీ.. కోహ్లి సరికొత్త రికార్డు | Virat Kohli Completes 36 ODi Century Against West Indies | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 7:42 PM | Last Updated on Sun, Oct 21 2018 8:37 PM

Virat Kohli Completes 35 ODi Century Against West Indies - Sakshi

95 వ్యక్తిగత పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను..

గువాహటి : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు శతకాలు సాధించారు. 85 బంతుల్లో 15 ఫోర్లతో కెరీర్‌లో కోహ్లి 36వ సెంచరీ పూర్తి చేసుకోగా.. 84 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్స్‌లతో రోహిత్‌ 20వ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫోర్‌తోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ వన్డేల్లో ఛేజింగ్‌లో 6 వేల పరుగులు పూర్తి చేశాడు. అంతకు ముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు.  

ఇక 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అనంతరం రోహిత్‌ శర్మకు జత కలిసిన కోహ్లి వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. ఒకవైపు రోహిత్‌ శర్మ కుదురుగా బ్యాటింగ్‌ చేస్తే, కోహ్లి మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్‌ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లి తొలుత  శతకం సాధించగా.. అనంతరం రోహిత్‌ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్‌ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు.  ఈ క్రమంలో కోహ్లి(140)ని బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్‌ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement