ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ బాబ్ విల్లీస్ (ఫైల్)
లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించడాన్ని ఇంగ్లండ్ మాజీ బౌలర్ బాబ్ విల్లీస్ తప్పుబట్టారు. కోహ్లి కౌంటీలు ఆడటమేంటి నాన్సెన్స్ అంటూ మండిపడ్డారు. ఇలా విదేశీ ఆటగాళ్లు కౌంటీలు ఆడితే స్థానిక ఆటగాళ్లు నష్టపోతారని ఇది ఇంగ్లండ్ క్రికెట్‌కు అంత మంచిది కాదని ఈ లెజండరీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. ఆగస్టులో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటస్తుండటంతోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు.
కౌంటీల్లో ఆడి అనుభవం పొందిన కోహ్లిని ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆపటం ఇంగ్లీష్ బౌలర్లుకు కష్టతరమని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్తుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి జరగబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో రాణిస్తే జోరూట్, స్టీవ్ స్మిత్, కేన్స్ విలియమ్సన్‌లను మించిపోతాడని వ్యాఖ్యానించాడు.
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన గత ఐదు టెస్టుల్లో కోహ్లి కేవలం 134 పరుగులు చేసి పేలవమైన ఆట తీరుతో అభిమానులను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పర్యటనలోనైనా రాణించాలని కోహ్లి కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇదివరకే భారత టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, బౌలర్లు ఇషాంత్ శర్మ, వరున్ ఆరోణ్‌లకు కౌంటీలు ఆడేందుకు బీసీసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ అనంతరం ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందకు భారత జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment