'వివ్ రిచర్డ్స్ను గుర్తు చేస్తున్నాడు' | Virat Kohli reminds me of Viv Richards, ravi Shastri | Sakshi
Sakshi News home page

'వివ్ రిచర్డ్స్ను గుర్తు చేస్తున్నాడు'

Published Thu, Feb 4 2016 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

'వివ్ రిచర్డ్స్ను గుర్తు చేస్తున్నాడు'

'వివ్ రిచర్డ్స్ను గుర్తు చేస్తున్నాడు'

న్యూజిలాండ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ను చూస్తుంటే వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు వీవ్ రిచర్డ్స్ గుర్తుకొస్తున్నాడని కొనియాడాడు. అన్ని ఫార్మెట్లలో తనదైన ముద్ర వేస్తూ చెలరేగిపోతున్న విరాట్.. రిచర్డ్స్ బ్యాటింగ్ను తలపిస్తున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. త్వరలో భారత్ లో వరల్డ్ టీ 20 జరుగనున్న నేపథ్యంలో పీటీఐతో రవిశాస్త్రి పలు విషయాలను పంచుకున్నాడు.

 

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రెండు సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. ఆ తరువాత జరిగిన టీ 20 ల్లో కూడా మూడు హాఫ్ సెంచరీలతో రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. విరాట్ తో పాటు సమానంగా రాణిస్తున్న రోహిత్ శర్మ, తన ఫామ్ ను తిరిగి అందిపుచ్చుకున్న శిఖర్ ధావన్ లు తమ ఆట తీరుతో ఆకట్టుకోవడంతో  ప్రపంచ అత్యుత్తమ టాప్-3 జట్లలో భారత్ నిలిచిందన్నాడు. వీరి వ్యక్తిగత ప్రదర్శనతో ఆసీస్ను వారి గడ్డపై ఇబ్బందులకు గురి చేశామన్నాడు. ఓపెనర్ గా వచ్చే శిఖర్ బ్యాట్ తో విధ్వంస చేసే పనిని లైసెన్స్ గా తీసుకున్నాడన్నాడు. ఒకసారి శిఖర్ ఫామ్ లోకి వస్తే అతన్ని ఆపడం కష్టమన్నాడు. మరోవైపు రోహిత్ తన క్లాస్ తో విరుచుకుపడే విధానం అద్భుతమన్నాడు. ఇక కోహ్లి విషయానికొస్తే  ప్రత్యర్థి బౌలింగ్ ను తునాతునకలు చేసి  వారికి కన్నీళ్లు తెప్పిస్తుంటాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement