ఇంగ్లండ్ జట్టు ఖర్చులపై ఏం చేయాలి? | What expenses should be on the team? | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్టు ఖర్చులపై ఏం చేయాలి?

Published Sun, Oct 30 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

What expenses should be on the team?

లోధా ప్యానెల్‌కు లేఖ రాసిన బీసీసీఐ 

 
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టుకు సంబంధించిన ఖర్చుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కోరుతూ జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్‌కు బీసీసీఐ లేఖ రాసింది. పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ పరస్పర అంగీ కార పత్రం (ఎంవోయూ)పై సంతకం చేయాల్సి ఉంటుంది.

‘ద్వైపాక్షిక సిరీస్ కాబట్టి ఇంగ్లండ్ జట్టు హోటల్ వసతి, ప్రయాణ, ఇతర ఖర్చులన్నీ మేమే భరించాల్సి ఉంటుంది. అరుుతే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ ఖర్చులను మేం చెల్లించాలా? లేక వారినే చెల్లించుకోమనాలా? ఈ విషయంలో మాకు స్పష్టత అవసరం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐకి సంబంధించిన  ఖర్చులపైన ప్యానెల్ నియమించిన ఆడిటర్ పర్యవేక్షణ ఉండాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement