
లంకపై యువభారత్ గెలుపు
అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయిన భారత యువజట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది
దుబాయ్:: అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయిన భారత యువజట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఐదోస్థానం కోసం సోమవారం శ్రీలంకతో జరిగిన ప్లే ఆఫ్ సెమీస్‌లో దీపక్ హుడా (56 బంతుల్లో 76 నాటౌట్; 3/31) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో భారత్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీస్కోరు సాధించగా, లక్ష్యఛేదనలో శ్రీలంక యువజట్టు 48.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్-అఫ్ఘానిస్థాన్ మధ్య మంగళవారం జరగనున్న ప్లే ఆఫ్ సెమీస్ విజేతతో భారత్ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఐదో స్థానం దక్కుతుంది.