‘ఆప్’పైనే ప్రధాన పార్టీల దృష్టి?
‘ఆప్’పైనే ప్రధాన పార్టీల దృష్టి?
Published Mon, Jan 13 2014 4:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం రెండు ప్రధాన జాతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇతర పార్టీలకంటే భిన్నంగా సామాన్యులకు టికెట్లు ఇచ్చి మరీ విజయం సాధించడంతో ఈ రెండు పార్టీలు ఆ పార్టీ అడుగుల్లోనే అడుగులు వేస్తున్నాయి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పైనే దృష్టి సారించే అవకాశముంది. ఈ నెల 17వ తేదీన ఏఐసీసీ సమావేశం జరగనుండగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 17 నుంచి 19వ తేదీదాకా జరగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి నానాటికీ ప్రజాదరణ పెరుగుతున్న సంగతి విదితమే. ఆప్ ప్రభావం తమపై పడిందని అంగీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా లేకపోయినప్పటికీ ఈ రెండు ప్రధాన పార్టీల చర్యలు దానినే సూచిస్తున్నాయి.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం రెండు రోజుల క్రితం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు అత్యంత విశ్వసపాత్రులైన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ తదుపరి ఎన్నికల్లో ఎటువంటి మచ్చ లేని సామాన్య కార్యకర్తలకు సైతం టికెట్లు ఇస్తామన్నారు. ఇందుకు సంబంధిం చిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆప్ విజయపు అడుగుల్లో రాహు ల్ అడుగులు వేస్తూ...అభ్యర్థుల ఎంపిక విషయం లో సాధారణ కార్యకర్తల అభిప్రాయాలకు తప్పనిసరిగా తగిన ప్రాధాన ్యమిస్తామన్నారు.
మరోవైపు బీజేపీ కూడా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేసింది. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల జాబితా ఖరారుకు ఈ నెల 31వ తేదీని తుది గడువుగా పెట్టుకుంది. కేజ్రీవాల్ ప్రభావం నగరాల్లో కనిపిస్తోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో తమ పార్టీపై ఆప్ ప్రభావం చూపే అవకాశముం దని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆ పార్టీకి వరమే. ఇందువ ల్ల పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆ పార్టీ నాయకులు మరింత చేరువయ్యే అవకాశముంది. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతి నిధి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ‘వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికలను అనుసరించి మేము ముందుకు వెళ్లము. ప్రజల నాడి ఏమిటో మాకు తె లుసు’ అని పేర్కొన్నారు. పార్టీ సమావేశాల్లో ఆప్ ఎదుగుదలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశముందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.
అటువంటిదేమీ లేదు
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆప్ అంశం చర్చకొచ్చే అవకాశముందా అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారిని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. బీజేపీ, ఆప్‌లతోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఓడించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏమిచేయాలనే అంశంపైనే దృష్టి సారిస్తామన్నారు.
Advertisement