సాక్షి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం నెలకొల్పదలచిన కమిటీ ఏర్పాటవుతుందని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసినందువల్ల మంచి పదవిని ఆశిస్తున్నానన్నారు. తనకు కొంత మంది ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొందరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ఇందులో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుందని చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరుతున్న ఇతర పార్టీల నాయకులకు తాము ఎటువంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. బేషరతుగానే అందరూ చేరుతున్నారని వెల్లడించారు. దీనిపై పార్టీకి లిఖితపూర్వకంగా కూడా అందించారన్నారు. మాజీ డీజీపీ శంకర బిదరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది తానేనన్నారు. పార్టీ నియమావళిమేరకు ఆయనకు గత శాసన సభ ఎన్నికల సందర్భంగా టికెట్టు ఇవ్వలేకపోయామన్నారు. ఆయన మరి కొంత కాలం వేచి ఉంటే సముచిత స్థానం దక్కి ఉండేదని అభిప్రాయపడ్డారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో 450 మందికి నోటీసులు జారీ చేశామన్నారు.
వీరి లో ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సహా ఏడు మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడని వారిని ఎట్టి పరిస్థితులల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రి య దాదాపు పూర్తి కావస్తోందన్నా రు. ఎన్నికలకు రెండు, మూడు నెల ల ముందుగానే కాంగ్రెస్ అభ్య ర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు. కా గా బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉప పోరు తర్వాతే
Published Sun, Aug 18 2013 2:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement