యడ్డి బీజేపీలోకి వస్తేనే పూర్వ వైభవం
Published Wed, Oct 2 2013 3:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
విజయపుర, న్యూస్‌లైన్ :కేజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి తీసుకురాకపోతే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉండదని మాజీ మంత్రి బీఎన్ బచ్చేగౌడ అన్నారు. మంగళవారం ఆయన తన పుట్టిన రోజును అంధుల సమక్షంలో జరుపుకున్నారు. అన ంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... యడ్యూరప్పపై ఎన్ని ఆరోపణలు ఉన్నా అవి రుజువు కాలేదని, ఆయనలోని నాయకత్వ లక్షణాలు బీజేపీకి ఎంతో అవసరమన్నారు. అలాంటి నాయకుడు ప్రస్తుతం బీజేపీ లేరని బచ్చేగౌడ అభిప్రాయపడ్డారు. యడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి చంద్రేగౌడ, సదానందగౌడ పార్టీ అధిష్టానంతో చర్చించడం కూడా జరిగిందని గుర్తు చేశారు. తక్షణం అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని బచ్చేగౌడ విజ్ఞప్తి చేశారు. యడ్యూరప్ప బీజేపీలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందన్నారు. లేదంటే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చల్లినట్లేనని తెలిపారు.
Advertisement
Advertisement