‘శాతవాహనలో అక్రమాలపై మౌనం ఎందుకు?’
Published Thu, Mar 2 2017 3:21 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
హైదరాబాద్: శాతవాహన యూనివర్శిటీ లో జరిగిన అవినీతిపై సర్కార్ పెద్దల మౌనం వెనుక అంతర్యం ఏమిటని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ప్రశ్నించారు. వర్సిటీలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపించారు. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విషయం సమాచార హక్కు ద్వారా తేలిందని వెల్లడించారు. ఈ అక్రమ నియామకాల్లో మంత్రి కడియం శ్రీహరికి వాటా ఉందని ఆరోపించారు. వర్సిటీలో మూడేళ్లుగా ఇంటర్నల్ ఆడిట్ జరగనే లేదని వివరించారు.
గత మూడేళ్లలో రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని తెలిపారు. మంత్రి కడియం శ్రీ హరిపైనా ఇంచార్జి వీసీ జనార్దన్ రెడ్డితో పాటు వీసీ కోమల్ రెడ్డి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను ఉద్దరిస్తానని చెప్పిన కేసీఆర్ యూనివర్సిటీ లో జరుగుతున్న ఈ అవినీతిపై ఎందుకు స్పందించరన్నారు. ఆయన స్పందించకపోతే కాంగ్రెస్ పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Advertisement