టీనగర్: దిండుగల్‌లో కుమార్తె సహా డాక్టర్ కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వీరు విషపు ఇంజక్షన్‌తో ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసు లు భావిస్తున్నారు. దిండుగల్ రాణి మంగమ్మాల్ నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం రాత్రి చాలా సేపటి వరకు ఒక కారు ఆగి ఉంది. దీంతో స్థానికులు అనుమానించి కారు తలుపులను తెరవడానికి ప్రయత్నించగా లోపలి వైపు లాక్ చేసి కనిపించింది. లోపల ఇద్దరు వ్యక్తులు సీట్లలో తలలు వాల్చిన స్థితిలో ఉండగా అనుమానించి వెంటనే దిండుగల్ వెస్ట్ పోలీసులకు సమాచారం తెలిపారు.
సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు కారును తెరచి చూడగా లోపల ఒక వృద్ధుడు, యువతి అపస్మారక స్థితిలో పడివున్నట్లు తెలిసింది. పోలీసులు వారిని పరీక్షించి చూశారు. ఆ సమయంలో వారి ఇద్దరి చేతుల్లో సిరింజిలు ఉన్నాయి. పోలీసులు వెంటనే ఇద్దరిని దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు ఇరువురూ అప్పటికేమృతిచెందినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో మృతిచెందిన వ్యక్తి దిండుగల్ సమీపంలోగల నందవనపట్టికి చెందిన సోమసుందరం (60) అని తెలిసింది. ఈయన వత్సలగుండు ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియన్ వైద్యునిగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఆయనతో పాటూ మృతిచెంది కనిపించింది ఆయన కుమార్తె వానతి (25) గుర్తించారు. ఆమె న్యాయవాదిగా పనిచేస్తూ వచ్చారు. ఆమె భర్త కార్తికేయన్. అభిప్రాయ బేధాల కారణంగా ఇరువురూ విడిపోయి జీవిస్తున్నారు. ఇరువురూ కారులో మృతిచెంది కనిపించడం పోలీసులకు అనేక అనుమానాలు కలిగించింది. కుటుంబ వ్యవహారం లేదా వృత్తిలో సమస్యల కారణంగా విషం ఇంజక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వేరెవరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
తండ్రి,కూతురు ఆత్మహత్య?
Published Sun, Apr 24 2016 3:45 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement