తిరువొత్తియూరు: సీఎం ప్రారంభించిన 50 రోజులకే పల్లిపట్టినం హార్బర్ గ్రౌండ్‌ప్లోర్ కూలి సముద్రంలో పడిపోయింది. తంజావూరు జిల్లా పల్లిపట్టినంలో పాత హార్బర్‌ను కూల్చివేసి అదే స్థానంలో రూ.60 కోట్ల ఖర్చుతో నూతన హార్బర్‌ను నిర్మించారు. ఇది 950 మీటర్లతో రెండు పడవలు నిలుచునే విదంగా నిర్మించారు. పడవలకు మరమ్మత్తులు చేయడం, కార్యాలయం, రెండు చేపలు వేలం కేంద్రాలు, రెండు వలలు అల్లు గదులు, 30వేల లీటర్ల సామర్థ్యం గల నీరు నిల్వ చేయు తొట్టెలు, ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హార్బర్‌ను రాష్ట్ర ము ఖ్యమంత్రి ప్రారంభించిన 50 రోజులకే గ్రౌం డ్‌ప్లోర్‌లో ఓ భాగం కూలి సముద్రంలో పడటంతో జాలర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment