బళ్లారిలో కుండపోత
బళ్లారి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి కుండపోతలా భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అరటి తోటలు చెరువులను తలపించాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పదుల సంఖ్యలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.
పొలాల వద్ద చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం ద్వారా రక్షించారు. సిరుగుప్ప తాలుకాలో ఆర్టీసీ బస్సు వంతెన దాటుతుండగా అదుపు తప్పి వాగులోకి ఒరిగిపోయింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 78.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
-సాక్షి, బళ్లారి