పూర్తికాలం సీఎం నేనే
సిద్ధరామయ్య
బెంగళూరు: ‘ప్రస్తుతం నేను ముఖ్యమం త్రి స్థానంలో ఉన్నాను. పూర్తి కాలం కొనసాగుతా. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొప్పళ్లో స్థానిక మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. దళిత నాయకుడు సీఎం స్థానంలో కుర్చొంటే తనకు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులోని చర్చ్స్ట్రీట్ ఉదంతం ఆనంతరం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారన్నారు.
ఉగ్రవాదుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక ధోరణి అవలంభిస్తోందని విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. హెలిక్యాప్టర్ ఘటన తర్వాత తాను దేవాలయానికి వెళ్లి పూజలు చేసినట్లు మీడియాలోని ఓ వర్గం పనిగట్టుకుని ప్రసారం చేస్తోందన్నారు. ఇలాంటి అసత్య కథనాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.