లింగసూగూరు, న్యూస్‌లైన్ : బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అవీనీతి, అక్రమాలకు పాల్పడ్డాయని, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థులకు బుద్ధి చెప్పనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ వైజనాథ్ హిరేమఠ్ పేర్కొన్నారు.
మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 28 నియోజకవర్గాలలో ఆప్ పార్టీ పోటీ చేస్తోందన్నారు.దీంతో అధికార కాంగ్రెస్‌తోపాటూ విపక్షాలక వణుకు పుట్టిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ హిట్లర్ సంస్కృతిని పెంచి పోషిస్తుండగా జేడీఎస్‌లో కుటుంబ పాలన రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రంలో మోడీ, రాహుల్ గాంధీ హవా లేదన్నారు.
అవినీతి నిర్మూలనకు ఆప్ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే తొమ్మిది పర్యాయాలు పదవులు చేపట్టినా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఓటమి ఖాయమన్నారు. 9న పార్టీ అభ్యర్థి భీమరాయ, నేతలు రోడ్‌షో నిర్వహించనున్నారన్నారు. అనంతరం తాలూకా సంచాలకులుగా మహిబూబ్, తాలూకా ఇన్‌చార్జ్‌గా హనుమంతరాయలను నియమించారు.
అవినీతి పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారు
Published Wed, Apr 2 2014 4:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement