బాలీవుడ్ కలలు... | Samantha's entry into Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ కలలు...

Published Thu, Dec 11 2014 2:44 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ కలలు... - Sakshi

బాలీవుడ్ కలలు...


 దక్షిణాదిలో కాస్త పేరు వస్తే చాలు తదుపరి బాలీవుడ్ లక్ష్యంగా అడుగులు వేస్తుంటారు చాలామంది నటీమణులు. అలా ఇక్కడే హీరోయిన్‌గా స్థాయిని పెంచుకున్న అసిన్ నుంచి ఇలియానా వరకు పలువురు బాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు. అయితే నయనతార, అనుష్క వంటి టాప్ హీరోయిన్లు మాత్రం దక్షిణాదిలోనే దర్జాగా బతికేస్తున్నామని, ఉత్తరాదికి వెళ్లే ఆలోచన లేదని చెప్పేస్తున్నారు. అయితే తొలుత తెలుగులో, ఆ తరువాత కత్తి చిత్రంతో తమిళంలోను విజయాన్ని కైవసం చేసుకున్న చెన్నై చిన్నది సమంత మాత్రం బాలీవుడ్‌కు నేను సైతం అంటోంది. అందుకు కారణం లేకపోలేదు.
 
 ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్ల దరిదాపుల్లోకి రాని ఒక శీతల పానీయాల సంస్థకు ప్రచారం చేస్తున్న బాలీవుడ్ టాప్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను పక్కన పెట్టి నటి సమంతకు ఆ అవకాశాన్నిచ్చింది. దీంతో కాస్త చోటిస్తే దూసుకుపోయే ఈ జాణ బాలీవుడ్‌పై కన్నేసిందట. దక్షిణాదిలో వున్న క్రేజ్‌ను ఉత్తరాదిలో క్యాష్ చేసుకోవాలని ఆశ పుట్టిందట. ఎలాగో కూల్‌డ్రింక్ యాడ్ ద్వారా దేశ వ్యాప్తంగా ముఖ పరిచయం అయిపోయింది కాబట్టి బాలీవుడ్‌లో రంగ ప్రవేశానికి సరైన తరుణం ఇదేనని భావిస్తోందని సమాచారం. దీంతో అక్కడ ప్రమోట్ చేయడానికి మంచి మేనేజర్ అన్వేషణలో పడిందట. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తే ప్రియుడు సిద్ధార్థ్ సంగతేమిటన్న ప్రశ్నకు ఆ బాయ్‌ఫ్రెండ్‌తో లవ్ బ్రేకప్ అయ్యి చాలా రోజులయ్యిందంటున్నారు సమంత సన్నిహితులు. అవునా? కాదా? అన్నది వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాక గానీ తెలియదు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement