తప్పు చేశాం! | Shock to Vijay Kant | Sakshi
Sakshi News home page

తప్పు చేశాం!

Published Fri, Nov 4 2016 4:11 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

Shock to Vijay Kant

వైగో వ్యాఖ్య
కెప్టెన్‌కు షాక్

 

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమి పెద్ద తప్పు చేసిందని ఆ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో విచారం వ్యక్తం చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడమే ఆ తప్పు అని వ్యాఖ్యానించి కెప్టెన్‌కు పెద్ద షాకే ఇచ్చారు. తమిళనాట రాజకీయాలు భిన్నమే. కొన్ని పార్టీల నాయకులు అయితే, బద్ద శతృవుల వలే వ్యవహరిస్తుంటారు. రాజకీయ నాగరికత , స్నేహ పూర్వక పలకరింపులు ఇక్కడ అరుదే. ఎన్నికల సమయాల్లో భుజాలు భుజాలు రాసుకుంటారు. ఫలితాల్లో తేడా వస్తే మాత్రం కత్తులు దూసుకునే విధంగా మాటల తూటాల్ని పేల్చుతారు.

ఆ కోవలో ఎండీఎంకే నేత వైగో ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం గా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. సీపీఎం, సీపీఐ వంటి జా తీయ పార్టీలు, వీసీకే వంటి వెనుక బడిన సామాజిక వర్గం పార్టీతో పాటు, గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న డీఎండీకేను, కాంగ్రెస్‌ను చీల్చిన జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చి తానే కన్వీనర్‌గా ముందుకు సాగారు. ఆ ఎన్నికల్లో తాము ఆరుగురం అంటూ ముందుకు సాగి, చివరకు ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడారు. రాష్ట్ర చరిత్రలో ప్రపథమంగా సీపీఎం, సీపీఐ సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ప్రతి పక్షం అడ్రస్సు గల్లంతు కాగా, తమిళ మానిల కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఎన్నికల ప్రచారంలో ఇక, విజయకాంత్ సీఎం కూర్చీల్లో కూర్చునట్టే అని ధీమాతో ముందుకు సాగిన వైగో, తాజాగా, పేల్చిన మాటల తూటాలు డీఎండీకే అధినేతకు పెద్ద షాక్కే.


తప్పు చేశాం: ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో ఎండీఎంకే నేత వైగో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద తప్పే చేసినట్టు విచారం వ్యక్తం చేయడమే కాకుండా, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించడం గమనార్హం. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేలతో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో, ఎన్నికలయ్యే వరకు  సీఎం అభ్యర్థి అన్న వ్యక్తికి చాన్సే లేదన్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని విజయకాంత్ కోసం సడలించి పెద్ద తప్పు చేశామని విచారం వ్యక్తం చేశారు.

విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కూటమిలోని ఇతర పార్టీల మీద ప్రభావం పడ్డాయంటూ పరోక్షంగా సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతుపై వ్యాఖ్యానించారు. విజయకాంత్ అడిగిన  సీట్లు ఇచ్చేందుకు డిమాండ్లను నెరవేర్చడానికి ఎన్నికల సమయంలో డీఎంకే సిద్ధమైందని పేర్కొన్నారు. అరుుతే, వాటిని పక్కన పెట్టి తన కూటమిలోకి రావడానికి విజయకాంత్ మొగ్గు చూపడం , అందుకు కృతజ్ఞతగా సీఎం అభ్యర్థిత్వానికి అప్పగించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన తమ కూటమిలోకి వచ్చినా, సీఎం అభ్యర్థిత్వం నిర్ణయాన్ని సడలించకుండా ఉండి ఉంటే బాగుండేదేమో అన్న భావన ప్రస్తుతం నెలకొని ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని, అందుకు తగ్గ మూల్యం ఫలితాల రూపంలో చెల్లించుకున్నామని అసహనం వ్యక్తం చేశారు.

 ఇప్పుడు ఓ విషయం చెబుతున్నానని, తాను అన్నాడీఎంకే పక్షపాతి కానే కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. 2011 ఎన్నికల్లో పోయెస్ గార్డెన్ మెట్లు తాను ఎక్కలేదని, పరిస్థితుల ప్రభావంతో ఆ ఎన్నికల్ని బహిష్కరించినట్టు పేర్కొన్నారు. పాదయాత్రలో ఉన్న సమయంలో సీఎం జయలలిత తనను మర్యాద పూర్వకంగా పలకరించారని, దాన్ని ఆధారంగా చేసుకుని తాను రాజకీయాలు సాగించి ఉండొవచ్చని, అరుుతే, మర్యాద వేరు, రాజకీయాలు వేరు అన్న విషయాన్ని తెలిసిన వాడిని కాబట్టే, డీఎంకే, అన్నాడీఎంకేలను తాను ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేయడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement