నయీం అనుచరుడి ఇంటిపై సిట్ దాడి
ఆదిభట్ల : రంగారెడ్డి జిల్లాలో నయీం అనుచరుడి ఇంటిపై సిట్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఆదిభట్లలో నయీం అనుచరుడు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో సిట్ పోలీసులు అతని ఇంటికి వెళ్లగా...అప్పటికే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నయీం అనుచరుడి కుటుంబ సభ్యులను సిట్ పోలీసులు ప్రశ్నించారు. ఈ దాడిలో పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.