చెన్నై శివారు ప్రాంతాల రోడ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 13 కొత్త ప్రాజెక్టుల
ట్రాఫిక్ నియంత్రణకు 13 కొత్త ప్రాజెక్టులు
Published Tue, Dec 24 2013 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: చెన్నై శివారు ప్రాంతాల రోడ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 13 కొత్త ప్రాజెక్టుల ను అమలుచేసేందుకు ప్రణాళిక రూపొంది స్తోంది. సెవన్‌గ్రేడర్- సెపరేటర్స్, ఒక ఫ్లైఓవర్, రెండు ప్రధాన రోడ్ల విస్తరణ, ఒక స్కైవాక్, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంటి ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు రహదారుల శాఖ అధికారులు వెల్లడించారు. జపాన్ ఇంట ర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జీకా)కి ట్రాఫిక్ నియంత్రణ పనులను అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కారిడార్లలో ఆరేళ్లలో ఈ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
దక్షిణ చెన్నైలో హల్డా జంక్షన్ నుంచి ఫినెక్స్ సిటీమాల్, వేళచ్చేరి-తాంబరంలోని మడిపాక్కం రోడ్డును ఎల్ షేప్‌లో గ్రేడ్- సెపరేటర్ చేయనుండగా, సెల్లైయూర్ రోడ్డును అదే విధంగా చెన్నై వెస్ట్‌లో మౌంట్ పూందమల్లి- ఆవడి రోడ్డులోని ఆవడి జంక్షన్, రామావరం రోడ్లను గ్రేడ్‌లుగా విభజించేలా చేయనున్నట్లు తెలిపారు. చెన్నై-తిరువళ్లూరు రోడ్డు, అంబత్తూరు-వానగరం రోడ్డులోను ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నార్త్ చెన్నై లో మాధవరం- రెడ్‌హిల్స్ రోడ్డు, తిరువొత్తియూరు- పొన్నేరి-పాంచెట్ట రోడ్డు, మనలి ఆయిల్ రిఫైనరీ రోడ్డు జంక్షన్‌లలో గ్రేట్-సెపరేటర్స్ చేయనున్నట్లు వెల్లడించారు. జపనీస్ ఏజెన్సీతో కలిసి రహదారుల శాఖ నగర, నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement