గుండెపోటుతో మరో ఇద్దరు మృతి
నెట్‌వర్క్: ప్రకృతి వైపరీత్యం, పంటల సాగు కోసం చేసిన అప్పుల భారం తట్టుకోలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణ జిల్లా ల్లో బుధవారం వేర్వేరు చోట్ల 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు గుండెపోటుకు గురై మృతి చెందారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) రెండు బోర్లు తవ్వించినా చుక్కనీరు రాలేదు. అప్పులు మూడు లక్షకు చేరడంతో.. తీర్చే మార్గంలేక పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. కోహీర్ మండలం పైడిగుమ్మల్‌కు చెందిన గంగపురం చిన్న నర్సయ్య (38) బోర్లు వేయడానికి, సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకొన్నాడు.
నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం జన్నెపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిన్నగారి నర్సింగరావు(54), ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసారలోని వడ్డరిగూడకు చెందిన జాదవ్ బాలాజీ(50), నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామానికి చెందిన ఒరికొప్పుల అంజయ్య(46), యాచారం గ్రామానికి చెం ది న అనుముల శివ(22), పెద్దవూర ఈదులగూడెంకు చెందిన జోగు శ్రీను(22), మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన గుంపలి చెన్రాయుడు (36), వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లింగముడుపల్లెకు చెందిన సూరపు విజేందర్(35), ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన రైతు బిల్ల శ్రీనివాస్ (50) బలవన్మరణాలకు పాల్పడ్డారు.
గుండె ఆగి మరో ఇద్దరు రైతులు..
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగ్యాతండాకు చెందిన భూక్య నార్య(52)కు రూ. 4 లక్షల అప్పులయ్యూరుు. అప్పులకుతోడు రెండు రోజుల క్రితం కురిసిన భారీవర్షానికి వుక్కజొన్న నేలవాలడంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం భస్వన్న గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాములు (55) అప్పులు తేర్చే దారిలేక మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు.
10 మంది రైతుల ఆత్మహత్య
Published Thu, Sep 10 2015 2:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
Advertisement
Advertisement