పాల్వంచ రూరల్ (ఖమ్మం) : సాంకేతిక లోపం కారణంగా ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్‌లోని మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదివారం రాత్రి స్థానిక ఓఅండ్‌ఎంలోని ఎ స్టేషన్‌కు చెందిన 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల మొదటి యూనిట్ బాయిలర్ ట్యూబుల్లో సమస్య తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్‌చార్జి సీఈ మూర్తి పర్యవేక్షణలో సంబంధిత ఇంజనీర్లు మరమ్మతులు చేపట్టారు. దీనికితోడు వార్షిక మరమ్మతుల కోసం 11వ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో మొత్తం 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోమవారం స్తంభించినట్లు అయింది.
కేటీపీఎస్‌లో 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
Published Mon, Jun 8 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement