వ్యవసాయానికి 7,100 మెగావాట్లు
► రబీ నుంచి 24 గంటల వ్యవసాయ కరెంటు సరఫరా
► 11 వేల మెగావాట్లకు పెరగనున్న రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్
► రూ.1,293 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు
► సీఎం కేసీఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీ నుంచి వ్యవ సాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థ లు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోటార్లు వేసుకునే విధంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయా లని సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు విద్యుత్ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ను సర ఫరా చేస్తుండడంతో గత మార్చి నెలలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అత్యంత గరిష్ట స్థాయికి పెరిగి 9,191 మెగావాట్లుగా నమోదైంది. ఇందులో దాదాపు 5 వేల మెగావాట్లను వ్యవసాయానికి సరఫరా చేసినట్లు అంచనా.
5 వేల నుంచి 7,100 మెగావాట్ల వరకు...
రాష్ట్ర ఆవిర్భావం నాటికి మొత్తం విద్యుత్ సరఫరా 5 వేల మెగావాట్లు ఉండగా, అందు లో 2,500 మెగావాట్లు వ్యవసాయానికి సర ఫరా జరిగేది. అప్పట్లో రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 6,553 మెగావాట్లు కాగా, ఆ తర్వాత కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యాక మరో 4,426 మెగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 16,336 మెగావాట్లకు పెరిగింది. దీంతో వ్యవసాయానికి 6 గంటల నుంచి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పెంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది.
వ్యవసాయ విద్యుత్ సరఫరాను 9 నుంచి 24 గంటలకు పెంచితే విద్యుత్ డిమాండ్ సైతం 5 వేల మెగా వాట్ల నుంచి 7,100 మెగావాట్లకు పెరుగుతుం దని అంచనా. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఇతర రంగాలను సైతం పరిగణనలోకి తీసు కుంటే రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 11 వేల మెగావాట్లకు పైనే ఉంటుంది. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వం లోని టీఎస్‌పీసీసీ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కోసం విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీలలో తీసుకోవాల్సిన చర్య లను పర్యవేక్షిస్తోంది.
వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి. అదే సమయంలో గృహ విద్యుత్ డిమాండ్ అధి కంగా ఉంటోంది. మరోవైపు ఆ సమయంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉండక పోవడంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌లోనే ప్రయోగాత్మ కంగా కొన్ని ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా జరిపేందుకు విద్యుత్ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. గత రబీలో సైతం కొన్ని చోట్లలో 24 గంటల కరెంటు సరఫరా చేసి పరీక్షించారు.
రూ.1,293 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు..
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా కోసం రూ.1,293 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా, పంపణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 400 కె.వి.సబ్ స్టేషన్లు ఆరు, 220 కె.వి.సబ్ స్టేషన్లు 12, 132 కె.వి.సబ్ స్టేషన్లు 21, 33 కె.వి./11 కె.వి. సబ్ స్టేషన్లు 30, పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ 230, 689 కిలోమీటర్ల మేర 33 కె.వి. లైన్లను కొత్తగా నిర్మిస్తున్నాయి.
24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం
వచ్చే రబీ నుంచి 24 గంటలు కరెంటు సరఫరా చేయ గలమనే నమ్మకముంది. రైతులకు 24 గంటల విద్యుత్ అందివ్వా లన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు విద్యుత్ శాఖ సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోంది.
24 గంటల విద్యుత్ సరఫరా కోసం అవసరమైన కరెం టును సమకూర్చు కోవడంతో పాటు ఎలాం టి ఆటంకాలు లేకుండా దాన్ని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాంకే తికం గానే కాకుండా, అవసరమైన ఉద్యోగులనూ పెద్ద ఎత్తున నియ మించుకుం టున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. వచ్చే రబీ నుంచి ఈ ఫీట్‌తో మేము కొత్త అధ్యాయం సృష్టి స్తామని నమ్మకంగా చెప్పగలను.
– ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు