‘ఆరోగ్యశ్రీ’కి ఆటంకాలు కలిగించొద్దు
వైఎస్సార్‌సీపీ రాష్ట్త్ర కార్యదర్శి అక్కెనపల్లి కుమార్
ముకరంపుర : ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండివైఖరి వీడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కెనపల్లి కుమార్ కోరారు. సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె శిబి రాన్ని ఆయన శుక్రవారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి ఆటంకాలు కలిగించొద్దన్నారు.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయూలన్నారు. కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతి నిధి వరాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గాలి ప్రశాంత్‌బాబు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సలీం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుంకర రమేశ్, సతీశ్, తిరుపతి, కిరణ్, కృష్ణారెడ్డి, యోగి, సురేష్, రాజు, చంద్రయ్య, ఆంజనేయులు, నీరజ, కల్పన, శైలజ, స్వరూప, రజిత, లత, వసుందర తదితరులు పాల్గొన్నారు.