ఖమ్మం వైరారోడ్ : సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది. ధర్నాచౌక్ వద్ద ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వల్ల ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలుగుతోంది. సమ్మె వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. అరుుతే రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వైద్యం అందిస్తున్నారని ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ సమ్మెను నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్లు పరిష్కరించాలి : మంద కృష్ణ
కాగా, దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మా ట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దానికి అనుసంధానంగా పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది స్థితిగతులను మర్చిపోరుు.. వారు రోడ్డునపడే విధంగా వ్యవహరించటం సరికాదన్నారు.
ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు పరిష్కరించాల ని, లేదంటే ఉద్యోగులతో కలిసి ఎటువంటి ఉద్యమానికైనా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బచ్చలకూర వెంకటేశ్వర్లు, ఈద య్య, జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి రాం బాబు, నాయకులు చూరగంటి అంజయ్య, హరీష్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ(ఎంఎల్) నగర కార్యదర్శి శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి ఆవుల వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ర్ట కార్యద ర్శి ప్రసాద్, రామకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు.
ఆరో రోజుకు ‘ఆరోగ్యశ్రీ’ సమ్మె
Published Fri, Jul 31 2015 3:25 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement