టీఎస్‌ఐఐసీలో మరో మూడు జోన్లు | another three zones in TSIIC | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఐఐసీలో మరో మూడు జోన్లు

Published Thu, Feb 16 2017 2:52 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

టీఎస్‌ఐఐసీలో మరో మూడు జోన్లు - Sakshi

టీఎస్‌ఐఐసీలో మరో మూడు జోన్లు

కొత్తగా నిజామాబాద్, యాదాద్రి, ఖమ్మం ఏర్పాటు
9కి పెరిగిన సంఖ్య.. సబ్‌ జోన్‌గా సిద్దిపేట


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ)లో 3 కొత్త జోన్లు, ఓ సబ్‌ జోన్‌ ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు గాను యాజమాన్యం జోన్ల పునర్వ్య వస్థీకరణ జరిపింది. దీంతో జోన్ల సంఖ్య 9కి పెరిగింది. ఇప్పటికే సైబరాబాద్, శంషాబాద్, జీడిమెట్ల, పటాన్‌చెరు, వరం గల్, కరీంనగర్‌ జోన్లుండగా కొత్తగా నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి కేంద్రం గా 3 కొత్త జోన్లు, సిద్దిపేట కేంద్రంగా సబ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తూ టీఎస్‌ఐఐసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీడిమెట్ల జోన్‌ను మేడ్చెల్‌ –సిద్దిపేటగా పేరు మార్చింది. అయితే, జీడిమెట్ల కేంద్రంగానే జోన్‌ కార్యాలయం పనిచేయనుంది.

ఏ జోన్‌ పరిధిలో ఏ జిల్లాలు?
నిజామాబాద్‌ జోన్‌ పరిధిలో ఆదిలాబాద్, కుమ్రంభీం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, కరీంనగర్‌ జోన్‌ పరిధిలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు, వరంగల్‌ జోన్‌ పరిధిలో భూపాలపల్లి, వరంగల్‌ (అర్బన్‌), వరంగల్‌ (రూరల్‌), జనగాం జిల్లాలు, ఖమ్మం జోన్‌ పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలు, యాదాద్రి జోన్‌ పరిధిలోకి నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలు రానున్నాయి. యాదాద్రి జోన్‌ భువనగిరి కేంద్రంగా పనిచేయనుంది.

ఇక మేడ్చెల్‌–సిద్దిపేట జోన్‌ పరిధిలో సిద్దిపేట, మేడ్చెల్, మల్కాజిగిరి జిల్లాలు, పటాన్‌చెరు జోన్‌ పరిధిలో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు, శంషాబాద్‌ జోన్‌ పరిధిలో రంగారెడ్డి (శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మండలాలు మినహా), మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు, సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో వికారాబాద్, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మండలాలు రానున్నాయి.

ఉద్యోగావకాశాల కోసం: గ్యాదరి
31 జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు, స్థానిక యువతకు ఉద్యో గావకాశాలు కల్పించేందుకు జోన్లను పున ర్వ్యవస్థీకరించామని సంస్థ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రణాళిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో సబ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement