రూ. 25.34 కోట్ల బీఆర్‌జీఎఫ్ పనులకు ఆమోదం! | Approval for the BRGF work | Sakshi
Sakshi News home page

రూ. 25.34 కోట్ల బీఆర్‌జీఎఫ్ పనులకు ఆమోదం!

Published Tue, Sep 23 2014 3:05 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Approval for the BRGF work

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్‌జీఎఫ్ (2014-15) పనుల కార్యాచరణ ప్రణాళికకు ఆమోదముద్ర పడింది. రూ.25.34 కోట్లతో 1,934 పనులు చేపట్టేందుకు నిర్దేశించిన తీర్మానాన్ని జడ్‌పీ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో సోమవారం చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మధ్యాహ్న భోజనం తరువాత జడ్‌పీ చైర్మన్ చాంబర్‌లో పది నిముషాలపాటు జరిగిన జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం కూడా బీఆర్‌జీ ఎఫ్ పనుల తీర్మానాన్ని ఆమోదించింది.

 జడ్‌పీ, డీపీసీ సమావేశాలు ఒకటి తర్వాత ఒకటి జరిగినా రెండు గంటలలో ము గిశాయి. అత్యవసర సమావేశమని ముందే ప్రకటించినా, ప్రధాన సమస్యలపై చర్చ జరుగుతుందని సభ్యులు భావిం చారు. కానీ, గడువు మించిపోతున్న కారణంగా బీఆర్‌జీఎఫ్ పనుల ఆమోదానికే ప్రాధాన్యం ఇచ్చారు.

 జాప్యమెందుకు జరిగిందో చెప్పండి
 పలువురు జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వివిధ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక ఆమోదంలో ఆలస్యం జరగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల ప్రతిపాదనలలో జాప్యం ఎందుకు జరిగిందో తెలపాలని నిజామాబాద్ జడ్‌పీటీసీ పుప్పాల శోభ కోరారు. తీర్మానాన్ని ఆలస్యంగా పంపడం మూలంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. తాము ఎన్నిక అయిననాటి నుంచి  సర్వసభ్య సమావేశాలు సక్రమంగా జరగడం లేదన్నారు.

ఇలా అయితే, అసలు జిల్లా పరిషత్ అంటే ఏమిటి? సమావేశాల ఎజెండా ఎలా ఉంటుంది? తదితర వివరాలు తమకు ఎలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి ఎంపీపీ రాజన్న మాట్లాడుతూ తమ మండలం నుంచి బీఆర్‌జీఎఫ్ పనులను ఆమోదించి జడ్‌పీకి పంపామని, ఇప్పుడు ఇందులో చూస్తే అవి కని పించడం   లేదన్నారు. ఎందుకు మార్పులు చేస్తున్నారో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు.

సమావేశం రెండు రోజుల పాటు నిర్వహించి పూర్తి అంశాలను చర్చిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చినా అమలు కావడం లేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బీఆర్‌జీఎఫ్ పనుల ఆమోదమంటూ తమ మెడపై కత్తి పెట్టారని వాపోయారు. జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం ఇందుకు సమాధానమిస్తూ, అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు దసరా తర్వాత రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం నిర్వహిద్దామని సూచించారు.

 అధికారుల బ్లాక్‌మెయిల్ రాజకీయాలు  గర్హనీయం
 జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విధులను విస్మరించే అధికారులను మందలించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు నమోదు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే పరిస్థితి ఉందన్నారు. మోర్తాడ్ ఎంపీపీ చిన్నయ్య మాట్లాడుతూ తాను ధర్మోర పాఠశాలను తనిఖీ చేసినపుడు హెచ్‌ఎం లేకపోవడంతో ఫోన్ చేసానని, తాను సెలవులో ఉన్నానని ఆయన సమాధానం చెప్పారని సభ దృష్టికి తెచ్చారు.

కానీ, టీఆర్‌ఎస్ నాయకులు అక్కడకు వచ్చి హెచ్‌ఎంకు మద్దతుగా గొడవ చేసి తిరిగి తనపైనే కేసుపెట్టారని వాపోయారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ చాలా చోట్ల అధికారులు విధులను విస్మరిస్తున్నారని, నిలదీస్తే ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి బ్లాక్‌మెయిల్ చేయడం పరిపాటిగా మారిం  దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివారిపై కఠి నంగా వ్యవహరించాలని కోరారు.

జడ్‌పీటీసీ సభ్యులకు మాత్రమే అత్యవసర సమావేశం ఎ జెండా కాపీలను సరఫరా చేసి, ఎంపీపీలను ఎందుకు విస్మరించారని, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగారావు ప్రశ్నించారు.ఇంకా పలు అంశాలను సభ్యులు ప్రస్తావించేందుకు యత్నించగా, పూర్తిస్థాయి సమావేశంలో చర్చిద్దామని, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నందున ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే పేర్కొన్నారు.


 బీఆర్‌జీఎఫ్ పనులు ఇలా
 రూ. 25.34 కోట్ల బీఆర్‌జీ నిధులను 20 శాతం పట్టణాలకు, 80 శాతం గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు కేటాయించాలని నిర్ణయించారు.  గ్రామ పంచాయతీలకు 1,255 ప  నులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ.607.30 లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలలో 135 పనులకు రూ.509.30 లక్షలు ఖర్చు చేయడానికి సమావేశంలో ప్రతిపాదించారు. 50 శాతం అదనపు నిధుల కింద 1,171 పనులకు రూ.1132. 50 లక్షల విడుదలకు తీర్మానించారు.

 ఇక్కడ స్వల్ప మార్పులు
 డీపీసీ సమావేశంలో బీఆర్‌జీఎఫ్ పనులలో స్వల్ప మార్పులు చేశారు. గ్రామ పంచాయతీలకు 1,260 పనులు, మండల పరిషత్‌లకు 365 పనులు, జిల్లా పరిషత్‌కు 174, మున్సిపాల్టీలకు 135, మొత్తం 1,934 పనులను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నట్లు జడ్‌పీ చైర్మన్ వెల్లడించారు. ఆరు మండలాల నుంచి వచ్చిన ఎన్ ఆర్‌ఈజీఎస్ పనుల ప్రతిపాదనలనూ ఆమోదించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, జడ్‌పీ సీఈఓ రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, జడ్‌పీ వైస్ చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement