సంక్షేమంలో సంక్షోభం ! | BC students must be in problems | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో సంక్షోభం !

Published Sat, Jul 11 2015 3:40 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

సంక్షేమంలో సంక్షోభం ! - Sakshi

సంక్షేమంలో సంక్షోభం !

- జిల్లా కేంద్రంలో చదివే బీసీ విద్యార్థులకు తప్పని తిప్పలు
- కళాశాల వసతిగృహాలు సరిపడా లేక ఇక్కట్లు
- ఉన్న హాస్టళ్లలోనూ పేదలకు దక్కని స్థానం !
- అయినవారికే అందలమనే ఆరోపణలు
- బాలబాలికల సమస్యలు పట్టని అధికారులు
ఇందూరు :
విద్యనభ్యసించేందుకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే పేద విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా ఉచితంగా భోజనం, అన్ని వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కళాశాల వసతిగృహాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సరిపడా వసతిగృహాలు ఉన్నప్పటికీ బీసీ విద్యార్థులు మాత్రం సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. బీసీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా, బాల, బాలికలకు ఒక్కో హాస్టల్ చొప్పున మాత్రమే ఉన్నారు. జిల్లాలోని 36 మండలాలకు చెందిన అనేక మంది బీసీ విద్యార్థులు జిల్లా కేంద్రంలో చదువుకుంటున్నారు.

వీరు ప్రతి రోజు మారుమూల ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి రావడం, తిరిగి ఇంటికి వెళ్లేసరికి  సమయమంతా బస్సుల్లోనే గడుస్తోంది. దీంతో కళాశాల వసతిగృహంలో ఉండేందుకు పలువురు విద్యార్థులు దరఖాసు చేసుకున్నారు. సుభాష్ నగర్‌లో ఉన్న బాలికల వసతిగృహంలో 100 సీట్లకు గాను ఇప్పటికే 106 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 60 మంది ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాందేవ్‌వాడలోని బాలుర వసతిగృహంలో 200 సీట్లు ఉండగా అవి కూడా భర్తీ అయ్యాయి.

ఇంకా చాల మంది విద్యార్థులు తమకు సీటు కావాలని అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. ప్రజావాణిలో సైతం ఈ సమస్యపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అరుుతే ఈ హాస్టళ్లలో ఇప్పటికే పరిమితికి మించి సీట్లు భర్తీ చేశామని, కొత్తగా ఇంకెవరికీ అవకాశం ఇవ్వలేమని బీసీ సంక్షేమాధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది బాలబాలికలు ఇంకా సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్లు ఖాళీగా ఉన్నా, అందులో బీసీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధిత శాఖల అధికారులు ఒప్పుకోవడం లేదు.
 
చర్యలు చేపట్టని అధికారులు...
జిల్లా కేంద్రంలో మరో రెండు కళాశాల వసతిగృహాలు అవసరం ఉన్నా వాటి కోసం బీసీ సంక్షేమాధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కనీసం ఉన్నతాధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా తెలిసిన వారికి సీట్లిచ్చి, అసలైన పేద వారికి సీట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. తద్వారా చాల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఈ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
 
బాలికలకు మరో హాస్టల్ నిర్మిస్తున్నాం
‘జిల్లా కేంద్రంలో బాలుర, బాలికల కళాశాల వసతిగృహాలు సరిపడా లేవు. ఉన్న వసతిగృహాల్లో సీటు కోసం చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సీట్లు లేకపోవడంతో వారికి న్యాయం చేయలేకపోతున్నాం. అయితే కోటగల్లిలో నూతనంగా బాలికల వసతిగృహాన్ని నిర్మిస్తున్నాం. అది పూర్తయితే బాలికల సమస్య సగం వరకు తీరుతుంది.’
- శ్రీనివాస్‌రెడ్డి,
ఏఎస్‌డబ్ల్యూఓ, నిజామాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement