భీమదేవరపల్లి: ‘‘చెట్లకు పైసలు కాయడం లేదు.. మనకు అప్పులు చెల్లించే స్తోమత ఉంది కాబట్టే దేశవ్యాప్తంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముం దుకు వస్తున్నాయి. అందుకే అప్పులు తీసుకొస్తాం.. అభివృద్ధి చేస్తాం’’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార డెయిరీ ఆవరణలో పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. అప్పుతీర్చే ఆర్థిక స్తోమత ఉన్నందున రైతులు, పేదల సంక్షేమం కోసం అప్పు లు చేస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా మని చెప్పారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 2.13 లక్షల మంది డెయిరీ రైతులకు రూ.1500 కోట్లతో పాడి పశువుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. కొమురవెల్లి మల్లన్న, బీరప్ప దేవుళ్ల స్వరూపమే కేసీఆర్ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment