చంద్రబాబు కుట్ర వల్లే కరెంట్ కష్టాలు
పిట్టలగూడెం (గుర్రంపోడు) : టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పన్నుతున్న కుట్ర వల్లే తెలంగాణలో కరెంట్ కష్టాలు దాపురిం చాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో రూ.కోటిన్నర నిధులతో నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ప్రాంతంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిం చకుండా ఇక్కడి బొగ్గుతో అక్కడ కరెంట్ ఉత్పత్తి చేసిన గత పాలకుల పాపం వల్లే రైతులకు నేడు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఆంధ్రా విద్యార్థులకు పదేళ్లపా టు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇదే చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఏపీ సర్కార్ నుంచి 54 శాతం కరెంట్ మన రాష్ట్రానికి రావాల్సి ఉన్నా చంద్రబాబు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో కరెంట్ కొరత ఉన్నా ఎకరం పొలాన్ని కూడా ఎండిపోకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎంత ఖరీదైనా కాని కరెంట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు తొత్తులుగా మాట్లాడుతున్న ఇక్కడి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, జెడ్పీ మాజీ చైర్మన్ చింతారెడ్డి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మరెడ్డి రఘుమారెడ్డి, పల్లె ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ పోలె సుజాత, అధికారులు పాల్గొన్నారు.