ఆగిపోయిన బాలిక వివాహం | Child Marriage stopped in Raghunathpally | Sakshi
Sakshi News home page

ఆగిపోయిన బాలిక వివాహం

Published Mon, Mar 20 2017 12:51 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ఆగిపోయిన బాలిక వివాహం - Sakshi

ఆగిపోయిన బాలిక వివాహం

పెళ్లి పందిరి వేశారు..బంధువులు వచ్చారు..మరో రెం డు గంటల్లో పెళ్లి ప్రారంభం కావాల్సి ఉండగా అనూహ్యంగా పెళ్లి ఆగిపోయింది.

► కలెక్టర్‌ జోక్యంతో నిలిచిన పెళ్లి
► అర్ధరాత్రి అడ్డుకున్న అధికారులు
 
గబ్బెట (రఘునాథపల్లి) : పెళ్లి పందిరి వేశారు.. బంధువులు వచ్చారు.. మరో రెం డు గంటల్లో పెళ్లి ప్రారంభం కావాల్సి ఉండగా అనూహ్యంగా పెళ్లి ఆగిపోయింది. ఈ సం ఘటన రఘునాథపల్లి మండలంలోని గబ్బె ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గబ్బెట గ్రామానికి చెందిన తొడేటి పర శురాములు–లక్ష్మి దంపతుల పెద్ద కూతురు శ్రీవాణి (16) గ్రామ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.
 
తల్లిదండ్రులు 16 ఏళ్ల కూతురిని పాలకుర్తి మండలం దర్దెపల్లి గ్రా మానికి చెందిన దుంపల మహేష్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు.ఆది వారం తెల్లవారుజామున 3.18 నిముషాలకు పెళ్లి జరగాల్సి ఉండగా గ్రామంలో బాల్యవివాహం జరుగుతుందని గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకొని బాల్య వివాహాన్ని నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం అర్దరాత్రి తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డి, ఎస్సై రంజిత్‌రావు, చైల్డ్‌లైన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌లు పరుశురాములు ఇంటికి చేరుకున్నారు.
 
18 ఏళ్లు నిండని బాలికకు పెళ్లి చేయ డం చట్టరీత్యా నేరమంటూ వివాహన్ని నిలి పేశారు. దీంతో పెళ్లి కూతురు తండ్రి పరశురాములు సొమ్మసిల్లి పడిపోగా 108ను రప్పించి వైద్య సేవలు అందించారు. ఓ దశలో కుటుంబసభ్యులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాలికకు పెళ్లి చేయ డం చట్టరీత్యానేరమని తెల్లవారే దాక అధికారులు అక్కడే ఉండి పెళ్లి నిలిపివేసి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement