మంత్రులతో సమావేశమైన కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు ఉదయం మంత్రులతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారం.
ప్రతిపక్షాల ఎదురుదాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమాయత్తమైంది. ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ వ్యూహ రచన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు సమావేశమై చర్చించనుంది.