24న గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం  | CM KCR Starts Gattu Irrigation Project | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 19 2018 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

CM KCR Starts Gattu Irrigation Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా జలాలను ఆధారం చేసుకుని గద్వాల జిల్లాలో చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ నెల 24 న శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పైలాన్‌ను ఆవిష్కరించి, బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్‌ నీటిని తీసుకుంటూ కొత్తగా ఈ పథకాన్ని చేపట్టనున్నారు. రూ.553.98 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్‌ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టే ఈ పథకాన్ని తొలి విడతలో రూ.459.05 కోట్లతో, రెండో విడతలో రూ.94.93 కోట్లతో చేపట్టనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement