‘కృష్ణా’లో కొత్త తిరకాసు! | CM KCR with AK Bajaj Committee about krishna water distribution | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’లో కొత్త తిరకాసు!

Published Thu, Feb 16 2017 2:46 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

‘కృష్ణా’లో కొత్త తిరకాసు! - Sakshi

‘కృష్ణా’లో కొత్త తిరకాసు!

పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చలేమన్న ఏకే బజాజ్‌ కమిటీ
కేవలం విధివిధానాలు మాత్రమే చూస్తామని స్పష్టీకరణ
తెలంగాణ అభ్యంతరం.. నిర్దిష్ట వాటా చెప్పాలన్న విద్యాసాగర్‌రావు
తాత్కాలిక కేటాయింపులు చేయాల్సిన బాధ్యత కమిటీదేనని వ్యాఖ్య
ఏపీతో చర్చల తర్వాత కమిటీ వైఖరి మారిందని విమర్శ


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదం కొత్త మలుపు తిరిగింది. గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటి వాటాలను తేల్చేం దుకు ఏకే బజాజ్‌ నేతృత్వంలోని కమిటీ నిరా కరించింది. తమ పని కేవలం విధివిధానాలకే పరిమితమని, పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలు తేల్చలే మని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏపీతో చర్చల అనంతరం కమిటీ వైఖరి మారిందని, దీనిపై రెండ్రోజుల్లో కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

బజాజ్‌ కమిటీ సోమవారం తెలంగాణ, మంగళవారం ఏపీ అధికారులతో విడివిడిగా భేటీలు నిర్వ హించిన సంగతి తెలిసిందే. బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత ఇరురాష్ట్రాల అధి కారులతో కమిటీ జలసౌధలో మరోసారి భేటీ అయింది. కమిటీ చైర్మన్‌ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్‌పీ పాండే,  ప్రదీప్‌ కుమార్‌ శుక్లా, ఎన్‌.ఎన్‌.రాయ్, కేఆర్‌ఎంబీ చైర్మన్‌ హెచ్‌కే హల్దర్, సభ్య కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ చటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీ« ధరరావు, వెంకటేశ్వర్‌రావు హాజరయ్యారు.

మాకు 78 టీఎంసీలు రావాల్సిందే..
సమావేశంలో కమిటీ కేవలం ఉమ్మడి ప్రాజె క్టుల విధివిధానాలపైనే చర్చిచింది. ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్‌ డేటా ఇవ్వాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించా యి. అయితే  పట్టిసీమ, పోలవరం వాటాలపై మాట్లాడకపోవడంతో విద్యాసాగర్‌రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కమిటీ జోక్యం చేసుకుంటూ.. వాటాల అంశాన్ని తాము పట్టించుకోవడం లేదని, ట్రిబ్యునల్‌ తేలుస్తుం దని పేర్కొంది. ట్రిబ్యునల్‌ కేటాయింపులను మార్చే అధికారం తమకు లేదని, కేంద్రం సూచిస్తేనే ఏదైనా మధ్యేమార్గాన్ని సూచిస్తా మంది. ఇందుకు విద్యాసాగర్‌రావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఏపీ చేపట్టిన పట్టి సీమ, పోలవరం ద్వారా ఎగువ రాష్ట్రాలకు దక్కే 98 టీఎంసీల వాటాలో పోలవరం ద్వారా 43, పట్టిసీమ ద్వారా 35 టీఎంసీలు కలిపి 78 టీఎంసీలు తెలంగాణకు దక్కాతని వాదించారు. కమిటీ ఏ మేరకు నీటి వాటా ఇస్తుందో నిర్దిష్టంగా అంకెలతో సహా చెప్పా లన్నారు. ఇందుకే కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో చిన్న నీటి వనరులకు సంబంధిం చిన సమాచారం కోసం బజాజ్‌ కమిటీ ఉత్సా హం ప్రదర్శించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అసలు విషయాన్ని వదిలి బయటి విషయాల జోలికెళ్లడం సరి కాదంది. వాటాలు తేల్చకుంటే ఇది ఉత్తుత్తి కమిటీగా మారుతుం దని పేర్కొంది. భేటీ అనంతరం విద్యాసాగర్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఏపీతో చర్చల తర్వాత ఒక్క రోజులో కమిటీ వైఖరి మారిం ది. ఇది దారుణం. ట్రిబ్యునల్‌ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కాలిక కేటాయింపులు చేయా ల్సిన బాధ్యత కమిటీపై ఉంది. అది పట్టించు కోకుండా విధివిధానాలు అంటే ససేమిరా ఒప్పుకోం. దీనిపై శుక్రవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చిస్తాం’’ అని చెప్పారు.

వాటాకు మించి వాడొద్దు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
కృష్ణా జలాల్లో తాము చేసిన కేటాయింపుల కంటే అధిక నీటిని వినియోగించరాదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. ఏపీ తన వాటా కంటే పోతిరెడ్డిపాడు కింద 2.29 టీఎంసీ, హంద్రీ నీవా కింద 2.96 టీఎంసీ మేర అధిక వాడకం జరిపిందని తెలిపింది. తెలంగాణ విషయానికొస్తే ఏఎంఆర్‌పీ కింద 0.87 టీఎంసీ, కల్వకుర్తి కింద 1.23 అధిక వినియోగం చేసిందని పేర్కొంది. కృష్ణా డెల్టా, కుడి, ఎడమ కాల్వల కింద మాత్రం ఇంకా ఇరు రాష్ట్రాలు తమ కేటాయింపు జలాలను వాడుకోవాల్సి ఉందని వివరించింది.    

కేంద్రం సూచిస్తే మధ్యేమార్గం చూపుతాం: ఏకే బజాజ్‌
ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపాం. నీటి కేటాయింపులు, వాటా అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో చర్చించాం. తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణ సీఎం చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో పరిష్కారం జరగాలని ఏపీ, తెలంగాణ సీఎంలు కోరుకుంటున్నారు. కానీ చిన్నచిన్న భేదాభిప్రాయాలున్నాయి. పట్టిసీమ, పోలవరం ద్వారా తరలించే నీటి వాటాలను తేల్చాల్సింది ట్రిబ్యునల్‌. ప్రస్తుత కేటాయింపులను మేం మార్చజాలం. అయితే కేంద్రం మాకు తగిన సూచనలు చేస్తే... మధ్యేమార్గాన్ని చూపుతాం. దాన్ని అమలు చేసే విషయం కేంద్రం నిర్ణయిస్తుంది. 20 రోజుల్లో మారుమారు ప్రాజెక్టుల సందర్శనకు వస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement