హైదరాబాద్ : కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. అధిక ఫీజులను నియంత్రించాల్సిన ఏఎఫ్ఆర్సీ బాధ్యతలను విస్మరించిందని ఆయన శనివారమిక్కడ అన్నారు.
ప్రభుత్వ పెద్దలే కొందరు కార్పొరేట్ వ్యక్తులతో కుమ్మక్కయారనే అనుమానాలు ఉన్నాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ వంటి వృత్తి విద్యా కాలేజీలలో ప్రవేశాలు, ఫీజులను నియంత్రించే అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ఏర్పాటుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.