ఏఎస్‌రావునగర్,న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి నాంది అని పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి అన్నారు.
మంగళవారం ఏఎస్‌రావునగర్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో 200 మంది మహిళ సంఘాల సభ్యులు పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా జరిగిన సభలో దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలంటూ..ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు.
విధినిర్వహణలో నిస్వార్థంగా సేవలందించానని, తనను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. ఆయన వెంట పార్టీ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి కుమార్‌యాదవ్, సుమతీమోహన్,ప్రశాంత్, త్రిపాఠి, డాక్టర్ పురుషోత్తంరెడ్డి, డాక్టర్ కొండారెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదు : రాజా
ముషీరాబాద్: చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదని సినీహీరో రాజా విమర్శించారు. ముషీరాబాద్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గాదె బాల్‌రెడ్డికి మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప ఎవరూ పేదల గురించి పట్టించుకోలేదన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బీసీ,మైనార్టీల శ్రేయస్సే లక్ష్యంగా ఉందని, అది జగన్ మనస్సులోంచి వచ్చిన మేనిఫెస్టో అని కొనియాడారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
అల్వాల్ : ప్రజావసరాలను తెలుసుకుని సాగే పాలన కావాలంటే వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని దినేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మచ్చబొల్లారంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హామీలనివ్వడంతోపాటు నెరవేర్చే సత్తా ఉన్న వారినే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
జోరుగా బొడ్డు పాదయాత్ర
బహదూర్‌పురా: వైఎస్సార్‌సీపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బొడ్డు సాయినాథ్‌రెడ్డి ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. మంగళవారం నందిముస్లాయిగూడలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని పార్టీ బహదూర్‌పురా అభ్యర్థి రామేశ్వరిశ్యామలతో కలిసి ప్రారంభించారు. అనంతరం నందిముస్లాయిగూడలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిరంతరం మీ వెంటే ఉంటాం
Published Wed, Apr 16 2014 1:53 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement