
ప్రజలను వంచించిన ఎన్డీఏ
ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున రైల్వే చార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని సీపీఎం జిల్లా నాయకుడు దండి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖలీల్‌వాడీ : ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున రైల్వే చార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని సీపీఎం జిల్లా నాయకుడు దండి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం స్థానిక బస్టాండ్‌వద్ద ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతోపాటు బ స్సు చార్జీలు పెరిగాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచి, ప్రజ లను మోసం చేసిందని భావించి, ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే చివరకు ఎ న్డీఏ కూడా మోసం చేసిందన్నారు. తక్షణమే పెంచిన చార్జీలను త గ్గించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పీవైఎల్ ఆధ్వర్యంలో పీఎం దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలని పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలం సాయిబాబా డిమాండ్ చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద పీఎం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశా రు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
రైల్వే చార్జీలకు వ్యతిరేకంగా పోరాడండి
ఎన్టీఏ ప్రభుత్వం రైల్వే చార్జీలను పెంచడం దురదృష్టకరమని, పెం చిన రైల్వే చార్జీలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
అందరిపై భారం
శివాజీనగర్ : ఎన్డీయే ప్రభుత్వం నెల రోజులు తిరగకముందే రైల్వే చార్జీలను భారీగా పెంచి, అందరిపై భారం వేసిందని ఐఎన్‌టీయూ సీ జిల్లా అధ్యక్షుడు వెంకులు(వెంకటేశ్వర్లు) పేర్కొన్నారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.