
పూర్తి కాని బాలికల టాయిలెట్లు
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు టాయిలెట్, మరుగుదొడ్లు లేక వారు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయమై సంవత్సర కాలంలో పలుమార్లు సాక్షిలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుమారు నాలుగు నెలల క్రితమే బాలికలకు టాయిలెట్, మరుగొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం కూడా మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండగా నాలుగు నెలలు అవుతున్నా నేటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. బాలికల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.