జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదించినా అమలు విషయం లో తీవ్ర జాప్యం జరుగుతోంది. టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి లభించినా అధికారులు పను లు చేపట్టడంలేదు. అయితే రాజకీయ నాయకు లు సైతం ఈ విషయంపై మౌనం వహిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ ఆక్రమణలకు గురి కావడంతో పలు రోడ్లు కుంచించుకు పోయాయి. దీంతో రోడ్లపై రాక పోకలు సాగిం చాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నా యి. గత దశాబ్ద కాలంతో పోల్చి చూస్తే మూ డింతలకంటే ట్రాఫిక్ పెరిగింది. దీంతో రోడ్లపై రాక పోకలు సాగించడం పాదచారులు, వాహ న చోదకులకు కష్టతరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2011లో టౌన్ ప్లానింగ్ అధికారులు జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిర్‌రోడ్డు విస్తరణకు మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రతిపాదించింది.
హైదరాబాద్‌లోని టౌ న్ అండ్ కంట్రి ప్లానింగ్ డెరైక్టరేట్‌ను సంప్రదిం చింది. మున్సిపల్ అధికారుల ప్రతిపాదనకు టౌన్ ప్లానింగ్‌అధికారుల నుంచి అనుమతి లభించింది. ఈ రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరించేందుకు వీలుగా అనుమతిచ్చింది. అనుమతి లభించి రెండేళ్లైనా మాస్టర్ ప్లాన్‌ను అమ లు పర్చే విషయంలో మున్సిపల్ అధికారులు సాహసించడం లేదు. ఇప్పటికే రైల్వే స్టేషన్‌కు పడమర వైపున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ రోడ్డుపై ఇప్పటికే ట్రాఫిక్ పెరిగింది. ఈ బ్రిడ్జి నుంచి 9వ జాతీయ రహదారికి రాక పోకలను సాగించాలంటే భవానీ మందిర్ రోడ్డు నుంచి ప్రయాణించాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మా స్టర్ ప్లాన్ కోసం ప్రతిపాదించారు. కానీ రోడ్డు వెడల్పు పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. పలు సాకులను చూపుతూ మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వాయిదా వేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భవానీ మందిర్‌రోడ్డుతో పాటు హనుమాన్‌మందిర్‌రోడ్డు, బ్లాక్ రోడు, సుభాష్‌గంజ్ రో డ్డు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా రోడ్లను కూడా విస్తరించేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం భవానీ మందిర్ రోడ్డు విస్తరణలోనే తీవ్ర జాప్యం జరుగుతున్నా మిగతా రోడ్ల విషయంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా భవానీ మందిర్ రోడ్డును విస్తరించే విషయమై వివిధ రాజకీయ పార్టీల నేతలు మౌనం వహిస్తున్నారు. రోడ్డు విస్తరణ చేపడితే వ్యాపార వర్గాల నుంచి ఎక్కడ వత్తిడి వస్తుందోననే ఉద్దేశంతోనే ఆయా పార్టీల నేతలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు, అధికారులు మరుగున పడవేశారనే విమర్శలున్నాయి. మా జీ మంత్రి గీతారెడ్డితో పాటు తెలుగుదేశం, టీ ఆర్‌ఎస్, బీజేపీ నేతలు సైతం రోడ్డు విస్తరణకు గాను మాస్టర్ ప్లాన్‌ను అమలు విషయాన్ని ప్రస్తావించక పోవడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ అమలు పర్చుతారనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్ అమలులో జాప్యం
Published Sat, May 24 2014 12:37 AM | Last Updated on Mon, May 28 2018 1:49 PM
Advertisement