కీసర: అక్రమ కట్టడాలపై రంగారెడ్డి జిల్లా కీసర రెవెన్యూ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. మండలంలోని దమ్మాయిగూడ గ్రామం, భవానీనగర్‌లో ప్రభుత్వ స్థలాల్లోని సుమారు 70 ఆక్రమ నిర్మాణాలను శనివారం జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. కాగా, ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి గ్రామ సర్పంచ్ అనురాధ మద్దతుగా నిలిచారు. ఇక్కడ పేదలు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారని, నిర్మాణాలను కూల్చవద్దని కోరారు. అయితే, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది సర్పంచ్‌కు వివరించారు. అనంతరం గట్టి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.