శంషాబాద్ మండలం తొండుపల్లి శివారులో ఉందానగర్- తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఇంజినీరింగ్ విద్యార్థి రిష్వంత్(18) ఆత్మహత్య చేసుకున్నాడు.
శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ మండలం తొండుపల్లి శివారులో ఉందానగర్- తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఇంజినీరింగ్ విద్యార్థి రిష్వంత్(18) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లవాసి కాగా శంషాబాద్ మండలం కాచారం వద్ద ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కళాశాల హాస్టల్‌లో ఉంటున్న రిష్వంత్ ఐదురోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాడు. సోమవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.