
ఆ ఇద్దరు బక్కోళ్ల కృషి వల్లే..!
నాడు బ్రిటిష్ పాలకుల పాలనను అంతమొందించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది బక్కాయనే (గాంధీజీ). అలాగే, ఆంధ్రపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బక్కాయనే (కేసీఆర్) అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
- నాడు దేశానికి స్వాతంత్య్రం.. నేడు తెలంగాణ సాకారం: కవిత
నారాయణపేట: నాడు బ్రిటిష్ పాలకుల పాలనను అంతమొందించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది బక్కాయనే (గాంధీజీ). అలాగే, ఆంధ్రపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బక్కాయనే (కేసీఆర్) అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ 14 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అటుకులు తింటూ, ఉద్యమాలు చేస్తూ.. పోరాటాలను కొనసాగించి యూపీఏ సర్కార్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.