కెరమెరి : ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం కిలికె గ్రామానికి చెందిన ఓ రైతు పంట దిగుబడి లేక, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్‌కిషన్‌కు ఐదెకరాల పొలం ఉండగా మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కేవలం రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేయడంతో అవి తీర్చే దారి లేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.