సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం అమలు తీరు పర్యవేక్షణకు ఫ్లయింగ్‌స్క్వాడ్ ఏర్పాటు చేయ నున్నట్లు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడి చెక్కుల పంపిణీపై వ్యవ సాయ అధికారులు, బ్యాంకర్లతో సోమవారం సచి వాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. రెవెన్యూశాఖ ఇచ్చే డేటాను వ్యవసాయ అధికా రులు సమీక్షించి చెక్‌ల ముద్రణ కోసం బ్యాంకు లకు పంపుతున్నారని, మొదటి విడతలో 3,300 గ్రామాల వివరాలను ఇచ్చారని చెప్పారు. చెక్కుల పంపిణీని గ్రామాల్లో పండుగలా జరపాలని సూచించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు.
స్థానిక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, అధికా రులతో గ్రామసభ నిర్వహించి ప్రతిరైతుకు స్వయంగా చెక్కును అందించాలని పేర్కొన్నారు. గ్రామంలోని రైతులందరికీ అదేరోజు చెక్కులను పంపిణీ చేయాలన్నారు. గ్రామసభలో టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచిం చారు. ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడిపై రైతులందరూ సంతృప్తి వ్యక్తం చేయాలని, ప్రతి పక్షాలు కూడా అభినందించాలన్నారు. ప్రతిజిల్లాకు రాష్ట్రస్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్‌మోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
మొక్కజొన్న కొనుగోలుకు రూ.1,000 కోట్ల రుణం
రబీలో మొక్కజొన్న పంట కొనుగోలు నిమిత్తం మార్క్‌ఫెడ్‌కు రూ.1,000 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీక రించాయని పోచారం వెల్లడించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. సోమవారం సచి వాలయంలో సమా వేశం నిర్వహిం చా రు. రాష్ట్రంలో ఏడా దికి 4 లక్షల ఎక రాల్లో మొక్క జొన్న పంట సాగైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment