అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. వికారాబాద్ మండలం గొట్టి ముక్కల గ్రామంలో బోయి లక్ష్మయ్య (58) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భాధతో మనస్తాపం చెంది.. ఆదివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేసిన పంట ఎండిపోవడంతో.. అప్పులు తీర్చే మార్గం కనపడక పోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సుమారు రూ.4లక్షల మేర అప్పు ఉన్నట్లు తెలిసింది.