మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ వరంగల్) ఇప్పుడు మరింత చేరువలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో ఇందులోని సగం సీట్లు మన విద్యార్థులకే దక్కనున్నారుు. మిగతా సగం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు చెందుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరిట సీట్ల కేటాయింపు జరిగేది. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఆశించిన మేర నిట్‌లో సీట్లు వచ్చేవి కాదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాల విద్యార్థులకు అత్యధిక సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారుు.
ఉన్నత సాంకేతిక విద్యలో దేశంలోని ఇతర యూనివ ర్సిటీలతో పోటీ పడుతున్న వరంగల్ నిట్‌లో గత విద్యాసంవత్సరం వరకు సీటు సాధించడమంటే మా మూలు విషయం కాదు. అత్యున్నత సాంకేతిక వి ద్యాప్రమాణాలు అందించడంలో ఐఐటీ తర్వాత నిట్ సంస్థదే కీలక పాత్ర. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో వరంగల్ నిట్ తెలంగాణ రాష్ట్రానికి దక్కడంతో ఇక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ఐఐటీలో చేరేందుకు విద్యార్థి మొదటి ప్రాధాన్యం ఇస్తాడు. అందులో సీటు రాలేదంటే నిట్‌కు రెండో ప్రాధాన్యం ఇస్తాడు.
ఐఐటీలో ప్రవేశం జాతీయ స్థా యిలో జరుగుతుంది. నిట్‌లో మాత్రం సొంత రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు యాభై శాతం సీట్లు కేటాయిస్తారు. జేఈఈ-మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా నిట్‌లో విద్యార్థికి సీటు లభిస్తుంది. 2014-15 విద్యాసంవత్సరంలో సీట్ల కేటాయింపుపై సీబీఎస్‌ఈ బోర్డు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మొదట ఆర్‌ఈసీ
వరంగల్‌లో రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల(ఆర్‌ఈసీ) పేరిట మొదట ఏర్పడింది. 1959లో దేశంలో మొత్తం 17 ఆర్‌ఈసీలను ప్రారంభించారు. వీటిలో వరంగల్ ఆర్‌ఈసీ ఒకటి. ఈ ఆర్‌ఈసీల నిర్వహణకు కేంద్రం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ నిధులు కేటారుుంచాల్సి వచ్చేది. 2007 వరంగల్ ఆర్‌ఈసీని నిట్‌గా మారుస్తూ.. నిర్వహణలో రాష్ట్ర బాధ్యతలను తప్పిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ తన ఆధీనంలోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో 30 నిట్ కళాశాలలుండగా.. ఒక్కో కళాశాలలో డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు ఐదు వేల సీట్లు ఉంటాయి. వరంగల్ నిట్ కళాశాలలోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు చెందుతాయి. మిగిలిన 50 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా సీబీఎస్‌ఈ బోర్డు కేటాయిస్తుంది.
నిట్‌లో విద్య
నిట్‌లో ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. డిగ్రీ, పీజీ చదువుతోపాటు పీహెచ్‌డీ వరకు చదివే అవకాశం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దొరుకుతుంది. పీజీతోపాటు పరిశోధనలకు సంబంధించిన చదువు సైన్స్ విభాగంలో ఉంది. నిట్‌లో చేరిన విద్యార్థికి అన్ని వసతులు ఉచితంగా లభిస్తాయి. 12 నుంచి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడిని నియమిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తికి అనుగుణంగా బోధనేతర సిబ్బంది పరిశోధనల్లో సహాయకులుగా ఉంటారు.
ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లిస్తే సరిపోతుంది. చదువు పూర్తయిన విద్యార్థికి క్యాంపస్ ఎంపికలో నెలకు రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఇచ్చిన కంపెనీలూ ఉన్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో సగం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనుండడంతో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
నిట్.. ఇక మనదే
Published Mon, May 26 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement