ఎస్‌ఏ సంపత్‌కుమార్ : ఏం.. తమ్ముడు బాగున్నావా..
నీ పేరేంటి..!
నరేష్ : సార్.., నాపేరు నరేష్
ఎస్‌ఏ సపంత్‌కుమార్ : ఏ ఊరు మీది.. ఏం చేస్తుంటావ్
నరేష్ : మాది అలంపూర్ సార్.. క్యాంటీన్ నడుపుతుంటాను.
ఎస్‌ఏ సంపత్‌కుమార్ : జోగుళాంబ ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..?
నరేష్ : ఇక్కడికొచ్చే యాత్రికులకు ప్రధానంగా బసచేయడానికి వసతి గదుల్లేవు. నీడపాటున సేదతీరడానికి వసతి లేదు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్‌ఏ సంపత్‌కుమార్ : ఏం.. బీసన్ననాయుడు ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయి?
బీసన్న నాయుడు: అలంపూర్-అలంపూర్ చౌరస్తా మధ్య డబుల్‌రోడ్డు పనులు చేశారు. ఇమాంపురం గ్రామం వద్ద డబుల్‌రోడ్డు పనులు చేయ లేదు. దీంతో ఇక్కడికొచ్చే భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్‌ఏ సంపత్‌కుమార్ : మిగిలిన డబుల్‌రోడ్డు పనులకు రూ.3.16 కోట్లు వచ్చాయి. కదా..!
బీసన్ననాయుడు : డబుల్ రోడ్డు పనులకు డబ్బులు వచ్చాయని చెబుతున్నారు.. పనులు మాత్రం చేయడం లేదు. మిగిలిన రోడ్డు బాగలేకపోవడంతో మూలమలుపుల వద్ద తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎస్‌ఏ. సంపత్‌కుమార్ : మురళి సమస్యలు ఏమైనా ఉన్నాయా?
మురళి : సార్.. మా గ్రామాలను కలుపుతూ నదిలో బ్రిడ్జి కడుతున్నారు. కానీ అది పూర్తికాకపోవడంతో ఇబ్బందిగా ఉంది.
ఎస్‌ఏ. సంపత్‌కుమార్ : అలంపూర్-ర్యాలంపాడు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కదా...?
మురళి : 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఇక్కడికి వచ్చినప్పుడు హామీఇచ్చారు. 2009లో దాన్ని ప్రారంభించారు. పనులు ఆరేళ్లనుంచీ సాగుతూనే ఉన్నాయి.
ఎస్‌ఏ. సంపత్‌కుమార్ : ఏం.. ఎంపీటీసీ సాబ్ మీ ఊరి సమస్యలు ఎంటీ..?
కృష్ణయ్య : మా సమస్య అంతా బ్రిడ్జి లేకపోవడమే.. సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామస్తులం మండలానికి ఏ చిన్నపనికి రావాలన్నా.. కర్నూలు మీదుగా రావాలి. అధికారులు మా ఊరికి సరిగ్గా రావడం లేదు. మాగ్రామాల్లో రోడ్లు బాగులేవు, తాగునీళ్లు రావు, అడవిలో ఉన్నట్లుంది.. సార్! బ్రిడ్జి పనులు తొందతరగా పూర్తయ్యేలా చూడాలి.
ఎస్‌ఎ. సంపత్‌కుమార్ : తప్పకుండా బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటాను. శ్రీనివాస్‌రెడ్డీ.. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
శ్రీనివాస్‌రెడ్డి : అలంపూర్‌కు సరైన రవాణామార్గం లేక మారుముల ప్రాంతంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చినప్పుడు ఇదే విషయాన్ని విన్నవించాం. ఆయన స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. బ్రిడ్జి పూర్తయితే మూడు పుణ్యక్షేత్రాలకు ఒకేదారిగా మారుతుంది. అలంపూర్ కేంద్ర బిందువుగా మారుతుంది. కనీసం ఆ పనులను మీరైనా పట్టించుకోండి..సార్!
వన్నె తెస్తా..
Published Mon, Feb 16 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement