భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త | Husband attacks Wife with an Axe | Sakshi
Sakshi News home page

భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త

Published Sun, Jun 28 2015 8:16 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Husband attacks Wife with an Axe

రంగారెడ్డి (అనాజ్‌పూర్) : ఓ వ్యక్తి  గొడ్డలితో దాడి చేసి భార్యను హతమార్చేందుకు యత్నించాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనాజ్‌పూర్‌కు చెందిన దానయ్యకు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.

అయితే ఆదివారం తెల్లవారుజామున భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసిన దానయ్య గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్యతో పాటు సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement